NTV Telugu Site icon

Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు

Darmana

Darmana

శ్రీకాకుళం జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ జిల్లా అద్యక్షులు ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ.. విత్తనం నుండి కోనుగోలు వరకు అంతా ప్రభుత్వమే చేపడుతుంది అని ఆయన అన్నారు. వ్యవసాయం దండగ అనే వారికి అవేం తెలీయదు.. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి చంద్రబాబు కు రైతు సమస్యలు తెలీయదు అని ఆయన పేర్కొన్నారు. వర్షాభావం ఉన్న పరిస్థితిలో కొంత కరువు ఉంది.. కరువుపై అధికారులు అద్యయనం చేస్తున్నారు.. అందరికి న్యాయం చేస్తాం.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు వ్యవసాయం గురించి ఏం తెలుసు అని ధర్మాన క్రిష్ణ దాస్ తెలిపారు.

Read Also: Varikapudisela Irrigation Project: మాచర్లలో సీఎం జగన్‌ పర్యటన.. వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

ఎంపీగా జిల్లాకు ఏం చేసావో చెప్పు అని ధర్మన క్రిష్ణ దాస్ ప్రశ్నించారు. సద్విమర్శ చేయు.. లోపాలుంటే సరిదిద్దుకుంటాం.. టీడీపీ నేతలకు మంచి పని చేయడం రాదు.. చేసిన పనులు విమర్శించడమే.. అమరావతి అని భ్రమతప్ప పెద్ద వారికి ఇల్లు కట్టాలని కనీసం ఆలోచించారా?.. కరోనాలో హైదరాబాద్ లో దాక్కున్నారు అయ్యా-కొడుకులు అంటూ ఆయన మండిపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్నాం.. వెనుక బడిన వర్గాల అభివృద్ధి కోసం 56 కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు.. మూడు ప్రాంతాల్లో దిగ్విజయంగా బస్సుయాత్ర జరుగుతోంది అని మాజీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Read Also: Virat Kohli Batting: భారత్, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్.. విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్!

రెండవ విడతగా నరసన్నపేట- ముబగాంలో బస్సుయాత్రని ప్రారంభిస్తున్నామని ధర్మన క్రిష్ణ దాస్ పేర్కొన్నారు. వివక్ష లేని పాలన సాగుతోంది.. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిబీటీ ద్వారా అందజేస్తున్నాం.. విద్యా, వైద్యం, సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకున్నాం.. ఎవరు గౌరవించని విధంగా అన్ని కులాలను గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజ్ లు కడుతున్నాం.. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే విదంగా ప్రజలు మద్దతు తెలపాలి.. ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం.. కిడ్ని బాధితుల కోసం ఫ్యూరిఫైడ్ వంశధార వాటర్, కిడ్ని రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూల పేట పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. మరోసారి సీఏం జగన్ ని ఆశీర్వదించాలని క్రిష్ణ దాస్ కోరారు.