NTV Telugu Site icon

BRS: ధరణి సాప్ట్ వేర్లో ఎలాంటి తప్పులు లేవు.. ధరణి వచ్చాకే రైతులకు లాభాలు

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

Dharani Portal was discussed in the assembly meetings today: ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ పై చర్చ జరిగింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చారు. ఈ క్రమంలో భూ భారతి బిల్లుకు శాసన సభ ఆమోదం కూడా తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కొద్ది మందికి జరుగుతున్న నష్టం పేరు మీద ధరణి రద్దు చేసి భూ భారతి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలంగాణ ప్రభుత్వం పడుతున్న మంగళ హారతి అని ఆరోపించారు. కోటి 70 లక్షల రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ చట్టం.. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఒక కుక్కను చంపాలంటే.. దానిని పిచ్చి కుక్కగా చూపిస్తారు. అదే విధంగా ధరణి విషయంలో కూడా ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ధరణి వచ్చాకా రైతులకు అనేక లాభాలు జరిగాయి.. రియల్ టైమ్ ఆప్ డేట్ అయ్యింది.. ఎలక్ట్రానిక్ పాస్ బుక్ వెంటనే వచ్చేలా చేసింది ధరణి అని అన్నారు.

Pushpa 2: వందేళ్ల హిందీ సినిమా చరిత్రను తిరగరాసిన అల్లు అర్జున్‌

86 సంవత్సరాల తరువాత ఏ రాష్ర్టంలో జరగని భూ రికార్డులు ప్రక్షాళన చేసింది కేసీఆర్ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ విదేశాల నుండి సాప్ట్‌వేర్ తెచ్చాడని రేవంత్ రెడ్డి అన్నారు.. ఇప్పుడు ఆ సాప్ట్ వేరే మీరు వాడుతున్నారని విమర్శించారు. ధరణి సాప్ట్ వేర్‌లో ఎలాంటి తప్పులు లేవు.. సాప్ట్ వేర్ ఎవరికీ తాకట్టు పెట్టలేదని అన్నారు. ఇప్పుడు ఇదే సాప్ట్ వేర్‌ను భూ భారతి పేరుతో వాడబోతున్నారని పల్లా పేర్కొన్నారు. మళ్ళీ మన్యువల్ పహానీలు, ఫౌతి సిస్టం తీసుకొస్తామని అంటున్నారు.. ఇది తిరోగమన చర్య అని అన్నారు. దీనితో మళ్ళీ లంచాల వ్యవస్థ ముందుకొస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైతుల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది.. ఈ చట్టం ద్వారా రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. ఈ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Divorce Case: “బిడ్డకు పేరు పెట్టే విషయంలో గొడవ”.. పిల్లాడికి కోర్టు ఏం పేరు పెట్టిందో తెలుసా..

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పదే పదే ఒక్క వ్యక్తి కోసం కొట్లాడుతున్నారు అంటున్నారు.. కానీ తాము నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడుతున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల ఫార్ములా ఈ రేస్ సంస్థ లండన్‌లో కేసు పెట్టిందని దుయ్యబట్టారు. మరోవైపు.. ఈరోజు పోడియం వద్దకు వెళ్లి పోరాటం చేశాం.. అసెంబ్లీ లోపల సెక్యూరిటీ పెట్టుకొని సభ నడుపుతున్నారంటే.. ఎంత చేతకాని వాళ్ళో అర్ధం అవుతుందని మండిపడ్డారు. హైదరాబాద్‌ను ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా కేటీఆర్ చూపించాడు.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిప్ప కూడు తిన్నాడు కాబట్టి.. అందరికీ చిప్ప కూడు తినిపించాలని అనుకుంటున్నాడని ఆరోపించారు. ఇదే కేటీఆర్‌కి.. రేవంత్ రెడ్డికి ఉన్న తేడా అని అన్నారు. సభలో ఏక పక్షంగా తమ వీడియో మాత్రమే విడుదల చేశారు.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం తెలంగాణ ప్రజానీకానికి చూపించినందుకు ధన్యవాదాలు అని అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే చెప్పు చూపిన వీడియో కూడా బయట పెట్టాలని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.

Show comments