మల్టీ టాలెంటెడ్ స్టార్ ధనుష్ కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వంతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే తన దర్శకత్వంలో ‘పా పాండి’, ‘రాయన్’ వంటి చిత్రాలతో మెప్పించిన ధనుష్, ఇప్పుడు తన తదుపరి దర్శకత్వ వెంచర్ కోసం టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో ఒక పీరియడ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా 1970ల నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. ఈ కథలో మృణాల్ ఠాకూర్ పాత్ర చాలా పవర్ఫుల్ రోల్ లో ‘దేవత’ తరహాలో ఉంటుందని టాక్.
Also Read : SRK : షారూఖ్ ‘కింగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డీల్
ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మృణాల్‌పై లుక్ టెస్ట్‌లు కూడా పూర్తయ్యాయని ధనుష్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌తో చాలా ఇంప్రెస్ అయ్యారని వినికిడి. మృణాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ధనుష్ నటించిన కర ఈ నెల 30న రిలీజ్ కు రెడీగా ఉంది. దాంతో తన నెక్ట్స్ డైరెక్షన్ పై ఫోకస్ చేసాడు ధనుష్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ధనుష్ ఈ సినిమాలో నటిస్తారా లేదా కేవలం దర్శకత్వానికే పరిమితమవుతారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ధనుష్ మేకింగ్ స్టైల్ మరియు మృణాల్ అభినయం తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ ఖాయమనిపిస్తోంది.
