Dhanush: ధనుష్ తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తున్న ‘సర్’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2023లో విడుదల చేయనున్నారు. ఇది కాకుండా ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడు. దీనిని వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ ఎల్ పి వారు నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా ధనుష్ మరో తెలుగు చిత్రానికి సైన్ చేసినట్లు వినిపిస్తోంది.
Yashoda Movie: సినిమా రిలీజ్‌కి లేని అభ్యంతరం ‘యశోద’ ఓటీటీ విడుదలకు ఎందుకు!?
‘నీది నాది ఒకే కథ, విరాట పర్వం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల ధనుష్‌ను కలిసి కథ వినిపించాడట. ధనుష్ కి లైన్ నచ్చిందట. పూర్తి స్థాయి స్క్రిప్ట్ తో మరోసారి ధనుష్ ని కలవనున్నాడు వేణు ఉడుగుల. ఈ సినిమాను కూడా ధనుష్ తో ‘సర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు వినికిడి. సో ధనుష్ అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ పూర్తి స్థాయిలో బిజీ కానున్నాడన్నమాట.