Raghuvaran Btech : కోలీవుడ్ స్టార్ మీరో ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1, 2015న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నిజానికి ఈ సినిమా తమిళంలో జులై 18, 2014లోనే ‘వేలై ఇళ్ళ పట్టదారి’గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విద్యార్థుల భవితవ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, కాన్సెప్ట్ నచ్చడంతో ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. ఇక ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులకూ సినిమా నచ్చడమే కాదు, ధనుష్ కంటూ పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 4న 2025 లో మళ్ళీ విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఇది మన తెలుగు యువతకి సాలిడ్ న్యూస్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమాని చాలా మంది థియేటర్స్ లో మిస్ అయ్యారు. ఈ సారి డెఫినెట్ గా బాగానే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పొచ్చు.
Read Also:TTD Hundi Revenue: మరోసారి రూ.100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ..
ప్రముఖ దర్శకుడు కిశోర్ తిరుమల తెలుగు డైలాగ్స్ రాయగా డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా ఆయన రాసిన మాటలన్నీ ఒరిజినల్ సినిమాకు రాసినట్టు రాశారని అప్పట్లో మంచి పేరు వచ్చింది. ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్ అందించగా రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉందని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ సరసన అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రలో నటించారు. ధనుష్ తల్లిదండ్రులుగా శరణ్య, సముద్రఖని నటించిన ఈ సినిమాలో వివేక్, హృషికేష్, అమితాష్ ప్రధాన్ ఇతర కీలక పాత్రల్లో నటించగా వేల్ రాజ్ దర్శకత్వం వహించారు.
Read Also:AUS vs IND: టీమిండియా జోరు.. బ్రేక్‌లు వేసేందుకు ఆస్ట్రేలియా కుట్ర