NTV Telugu Site icon

Raayan OTT: ‘రాయన్‌’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడంటే?

Raayan Review

Raayan Review

Raayan OTT Release Date Telugu: తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటించి, తెరకెక్కించిన చిత్రం ‘రాయన్‌’. ధనుష్‌ కెరియర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. జూలై 27న విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో రాయన్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది.

రాయన్‌ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ ప్రత్యేక పోస్టర్‌ ద్వారా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషలలో రాయన్‌ స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది. థియేటర్లో సినిమా చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో ధనుష్‌ తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్‌గా కూడా మెప్పించాడు. తన తమ్ముళ్లు, చెల్లి కోసం రాయ‌న్ ఏం చేశాడు?, రాయ‌న్ కోసం వాళ్లు ఏం చేశారు? అన్నదే ఈ సినిమా కథ.

Also Read: Babar Azam: బాబర్‌ అజామ్‌ ఆడకపోయినా ఫర్వాలేదా?.. ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్!

రాయన్‌లో సందీప్ కిషన్, దుషరా విజయన్, ఎస్‌జే సూర్య వంటి స్టార్స్‌ నటించారు. ఈ మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ధనుష్‌ నటిస్తున్నాడు. ఇందులో కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు.

Show comments