సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన 173వ సినిమాను ప్రకటించాడు. ఉలగనయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సీ డైరెక్షన్ లో ఈ రాబోతుందని ఇటీవల గ్రాండ్ గా ప్రకటించారు.కానీ కానీ కేవలం పది రోజుల వ్యవధిలోనే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఫలితంగా, చిత్ర బృందం మళ్ళీ ‘డైరెక్టర్ హంట్’ ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్–కమల్ హాసన్ లాంటి లెజెండరీ కాంబినేషన్‌కు తగిన స్థాయి, విజన్ ఉన్న దర్శకుడిని తమిళంలో కనుగొనడం టీమ్‌కు సవాలుగా మారింది. స్టార్ ఇమేజ్-కంటెంట్ బ్యాలెన్స్ చేయగల దర్శకుడు దొరకకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభ దశలోనే గందరగోళంలో పడింది.
రజనీ–కమల్ టీమ్ ఇప్పుడు టాలీవుడ్ వైపు కూడా దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూమం దాల్చలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తన్న టాక్ ఏంటంటే రజనీ సినిమాను ఆయన మాజీ అల్లుడు ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్. రాయన్, నీక్, ఇడ్లీ కొట్టు వంటి సినిమాలతో దర్శకుడిగా ధనుష్ మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ సినిమాతో ధనుష్ తో డైరెక్ట్ చేపించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందుకు రజనీ కూతురు ఐశ్వర్య ధనుష్ ఒప్పుకుంటుందా అనేది కూడా చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా రజని సినిమాల విషయాలను ఆయన కూతురే దగ్గరుండి చూసుకుంటుంది. ఏ సినిమా చేయాలి ఎవరి డైరెక్షన్ లో చేయాలి ఇవన్నీ ఆమెనే చూస్తుంది. మరి ధనుష్ తో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ఐశ్వర్య తన తండ్రి ప్రెస్టీజియస్ సినిమాను ధనుష్ తో చేసేందుకు ఒప్పుకుంటుందో లేదో.
