Site icon NTV Telugu

DGP Anjani Kumar: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Anjani Kumar

Anjani Kumar

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సైబర్ నేరాలపై సెమినార్.. ఈ సెమినార్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సైబర్ నేరాలు పట్ల అవగాన ఉండాలి.. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులకు, పబ్లిక్ కి అవగాహన కల్పించాము అని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు అడ్డుకట్ట వేయడం ఛాలెంజింగ్ గా మారింది.. ఈ సెమినార్ లో పాల్గొనడం గర్వంగా ఉంది.. ఇలాంటి సెమినార్లు నిర్వయించడం ద్వారా పబ్లిక్ లో మరింత అవగాహన వస్తుంది అని అంజనీ కుమార్ అన్నారు.

Read Also: Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేస్తోంది.. వచ్చే నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్..

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. మీ ఫోన్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెస్సేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుర్తి తెలియని వ్యక్తులు చేసే మోసాలకు గురి కావొద్దని తెలిపారు. మీ పోన్ హ్యాక్ అయితే.. వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సరికొత్త మోసాలలో ఈ సైబర్ దాడులు జరుగుతున్నాయి… ఇలాంటి వాటిని గమనించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ అన్నారు.

Read Also: Botsa Satyanarayana : 8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం.

Exit mobile version