NTV Telugu Site icon

Devineni Chandrasekhar Rao: మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంట విషాదం..

Devineni Chandrasekhar Rao

Devineni Chandrasekhar Rao

Devineni Chandrasekhar Rao: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది.. దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు కన్నుమూశారు.. ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న దేవినేని చంద్రశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందారు.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు చంద్రశేఖర్.. దీంతో.. మూడురోజులుగా హైదరాబాద్ లోనే ఉండే తన సోదరుడి బాగోగులను చూస్తు వచ్చారు దేవినేని ఉమ.. అయితే, ఈ రోజు తెల్లవారుజామున చంద్రశేఖర్‌రావు కన్నుమూయడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.. ఇక, ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత హైదరాబాద్‌ నుంచి కంచికచర్లకు చంద్రశేఖర్ పార్థివదేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. దేవినేని చంద్రశేఖరరావు మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం కంచికర్లలో చంద్రశేఖర్‌ రావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తు్న్నారు.

Read Also: Paytm : మీరు పేటీఎం మనీతో షేర్లు కొన్నారా? అయితే మీకు షాక్ తప్పదు

Show comments