Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Devi Sri Prasad Bgm Controversy Tollywood Music Director Update

Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?

Published Date :March 17, 2026 , 7:04 pm
By Bhargav Chaganti
Devi Sri Prasad: దేవీశ్రీ  దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్‌లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ అదే ‘రాక్ స్టార్’ దేవీశ్రీ ప్రసాద్‌కు ఏమైంది? అని. నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచిన ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు కేవలం పాటలకే పరిమితం అవుతున్నారా? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విషయంలో ఆయనను పక్కన పెడుతున్నారా లేక ఆయనే తప్పుకుంటున్నారా? చర్చ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. సాధారణంగా దేవీశ్రీ ప్రసాద్ అంటే అద్భుతమైన మెలోడీలు, మాస్ బీట్లే కాదు.. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు కూడా కేరాఫ్ అడ్రస్. కానీ, ఇటీవల కొన్ని క్రేజీ ప్రాజెక్టుల విషయంలో సీన్ మారుతోంది. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి దేవీశ్రీ పాటలు ఇచ్చారు. కానీ, రీ-రికార్డింగ్ బాధ్యతలను మాత్రం తమన్‌కు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read :Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్

అంతేకాదు, దేవీశ్రీకి అత్యంత సన్నిహితుడైన సుకుమార్ సినిమా ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి చర్చే నడిచింది. కొన్ని సీన్స్‌కు శ్యామ్ సి.ఎస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారనే వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్నా.. అక్కడ కూడా దేవీశ్రీ పేరు కాకుండా తమన్ పేరు వినిపిస్తుండటం గమనార్హం. రీసెంట్‌గా జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు దేవీశ్రీ హాజరుకాకపోవడంపై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇస్తూ.. ఆయన బిజీగా ఉండటం వల్లే రాలేదని చెప్పారు. అయితే, ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేని దేవీశ్రీకి అంత టైం దొరకడం లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు, దేవీశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నెలలో 10 రోజులు నటనకు, 20 రోజులు సంగీతానికి కేటాయిస్తానని కండిషన్ పెట్టుకున్నట్లు టాక్. హీరోగా బిజీ అవ్వడం వల్లే రీ-రికార్డింగ్ లాంటి ఎక్కువ సమయం తీసుకునే పనులకు ఆయన దూరమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!

‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడిగా దేవీశ్రీ కొనసాగుతున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఇక్కడ కూడా దేవీశ్రీ కాకుండా వేరే ఆప్షన్ వెతుక్కుంటే మాత్రం, రాక్ స్టార్ స్టార్ హీరోలకు దూరం అవుతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుతుంది. రీ-రికార్డింగ్ విషయంలో దేవీశ్రీ ఇస్తున్న అవుట్‌పుట్ మేకర్స్‌కు నచ్చడం లేదా? లేక ఆయన బిజీ షెడ్యూల్ వల్ల డెడ్ లైన్స్ మిస్ అవుతున్నారా? అన్నది క్లారిటీ లేదు. ఏది ఏమైనా, టాలీవుడ్‌ను ఏలిన ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కేవలం పాటలకే పరిమితం కావడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. దీనిపై రాక్ స్టార్ స్పందిస్తే తప్ప ఈ పుకార్లకు చెక్ పడేలా లేదనే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devi Sri Prasad BGM issue
  • Devi Sri Prasad songs vs background score
  • DSP latest updates
  • DSP Tollywood news
  • Pushpa 2 BGM composer

తాజావార్తలు

  • Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?

  • Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్

  • Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్

  • Oppo K14 5G: 7000mAh బ్యాటరీ బీస్ట్ Oppo K14 5G భారత్‌లో లాంచ్.. IP69 వాటర్‌ప్రూఫ్ + 50MP AI కెమెరా

  • Rakasa : భారీ మొత్తానికి రాకాస‌ హక్కుల అమ్మకం

ట్రెండింగ్‌

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions