Site icon NTV Telugu

Rashtriya Swayamsevak Sangh: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్‌ ఉండాలి..!

Rss

Rss

Rashtriya Swayamsevak Sangh: లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పని తీరుకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఫడ్నవీస్‌ ఇంటికి సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అతుల్ లిమాయే పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ఫడ్నవీస్ రాజీనామా ప్రతిపాదనపైనే దాదాపు రెండు గంటల పాటు చర్చి జరిగినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు పదవిలో కొనసాగాలని సంఘ్ సూచించింది.. ఇప్పుడు రాజీనామా చేస్తే, ఓటర్లలో తప్పుడు సందేశాన్ని పంపినట్లు అవుతుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పని తీరతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహ రచనపై కూడా ఈ మీటింగ్ లో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read Also: Prajavani: పునః ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం

కాగా, అంతకుముందు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ వావాన్‌కులేతో కలిసి నాగ్‌పూర్ విమానాశ్రయంలో దిగిన ఫడ్నవీస్, కార్యకర్తలకు అభివాదం చేసి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ పదవిలో కొనసాగుతారని తెలిపారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనే అబద్ధాలతో ఓటర్లను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై నిందలు వేసిన కాంగ్రెస్ ఈసారి వాటిని వదిలిశాయని బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ వవాన్‌కులే తెలిపారు.

Read Also: USA vs PAK: పాక్‌కు షాకిచ్చిన యూఎస్ బౌలర్ మనోడే.. రాహుల్‌, మయాంక్‌లతో కలిసి ఆడాడు!

ఇక, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశంసిస్తూ, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన అభివృద్ధి విధానాన్ని విస్మరించలేమని చంద్రశేఖర్ వవాన్‌కులే అన్నారు. మహారాష్ట్రలో ప్రధాని మోడీ ప్రారంభించిన పథకాలన్నింటినీ ఆయన విజయవంతంగా అమలు చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 6.5 కోట్ల మంది ప్రజల కోసం పని చేశాను.. రైతులకు సంక్షేమ పథకాలను అందించారు.. ఫడ్నవీస్ నేతృత్వంలోనే మహారాష్ట్రలో బలంగా ఉందని బీజేపీ చీఫ్ వవాన్‌కులే వెల్లడించారు. రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను 28 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా, అందులో కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలవగా.. దాని మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీ వరుసగా 7, 1 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా.. ఎన్నికల్లో శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) కూటమికి 30 సీట్లు వచ్చాయి.

Exit mobile version