NTV Telugu Site icon

Devara Part 1: ‘దేవర’ కొత్త కథ కాదు.. కానీ కొత్త కొరటాలను చూస్తారు!

Koratala Siva Devara

Koratala Siva Devara

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివకు మంచి ఇమేజ్‌ ఉంది. ‘ఆచార్య’ కొరటాల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. దీంతో ఆయనకు ‘దేవర’ ఓ సవాల్‌గా మారింది. దేవర ట్రైలర్‌ చూసిన తర్వాత.. ఆచార్య, ఆంధ్రావాలా, దమ్ము సినిమాలతో నెటిజెన్స్ పోలుస్తున్నారు. దానికి తోడు ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేశాడని అంటున్నారు. మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది? అనేది ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. కొన్ని అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి. అయితే కొరటాల ఎంచుకున్న కథ కొత్త కాదు కానీ.. ఈ సినిమాతో కొత్త కొరటాలను చూడబోతున్నామని మాత్రం చెప్పొచ్చు.

కొరటాల శివ తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు సోషల్ కాజ్ జోడించే విధానం బాగుంటుంది. దేవర సోషల్ కాజ్‌కు దూరం.. పక్కా కమర్షియల్ అని అంటున్నప్పటికీ ఏదో కీ పాయింట్ దాగి ఉన్నట్టుగా ఉంది. కొరటాల హీరోలకు మరో యాంగిల్ ఉంటుంది.. అది ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా? అనేది ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటునే బ్లాస్ట్ అవుతుంటారు కొరటాల హీరోలు. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు గూస్‌ బంప్స్ గ్యారెంటీ. అంతేకాదు ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇదే కొరటాల స్టైల్ ఆఫ్ మేకింగ్. దేవరలో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.

ఒకే తెగకు చెందిన వారిలో మంచోడు దేవర, చెడ్డోడు భైర. ఈ ఇద్దరు స్నేహితులే కానీ.. ఎప్పుడైతే భైర అక్రమాలు దేవరకు తెలుస్తుందో.. అక్కడే అసలు యుద్ధం మొదలవుతుంది. ఈ క్రమంలో దేవరను దెబ్బ తీయడానికి భైర ఏం చేశాడు?, దేవర పంతానికి ఎందుకు పోయాడు?, రెండేళ్లు ఎక్కడికెళ్లాడు?, అసలు దేవర బతికే ఉన్నాడా?, తండ్రిపై కొడుక్కి ఎందుకు కోపం? అనేది ఎంగేజింగ్‌గా చూపించగలిగితే కొరటాల సక్సెస్ అయినట్టే. అయితే ట్రైలర్‌ ప్రకారం ఒకానొక సమయంలో.. దేవరకు ఆ దొంగల గుంపుకు సంబంధం ఏంటనే డౌట్స్‌ కూడా రాక మానదు. ఇక కొడుకు వర క్యారెక్టర్‌ను చూస్తే.. భయస్తుడుగా ఉంటాడు. అలాంటి పిరికి వాడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందనే హై మామూలుగా ఉండదు. ఇక తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సినిమాకు ఆయుపట్టు అనే చెప్పాలి. అయితే.. తండ్రీ యుద్ధం చేస్తున్నప్పుడు కొడుకు ఎక్కడ ఉన్నాడు?, అసలు దేవర ఆశయం ఏంటి? అనేదే కీ పాయింట్. పైగా పార్ట్2 కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడే ఆన్సర్ దొరకదు. ఓవరాల్‌గా చూసుకుంటే.. దేవరలో హై ఇచ్చే ఎలిమెంట్స్ మాత్రం గట్టిగా ఉన్నాయనే చెప్పాలి. ఫ్యాన్స్ విజిల్స్ వేసే యాక్షన్‌, తెలియకుండానే కంట నీరు కార్చే ఎమోషన్స్‌ మాత్రం పక్కా.

Also Read: Malaika Arora: నటి మలైకా అరోరా ఇంట్లో విషాదం.. ఏడో ఫ్లోర్ నుంచి దూకి..!

అయితే ఆచార్యతో దేవర పోలిక, ఎస్ఎస్ రాజమౌళి సినిమా తర్వాత చేసే సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను తెగ టెన్షన్ పెడుతున్నాయి. మరి దేవర ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

Show comments