NTV Telugu Site icon

Devara Audio Rights: భారీ ధ‌ర‌కు ఎన్టీఆర్ ‘దేవర’ ఆడియో హ‌క్కులు!

Devara Movie

Devara Movie

T-Series bags Devara’s Music Rights: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థపై ఈ సినిమాను సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. దేవరలో జాన్వీ కపూర్‌ కథానాయిక కాగా.. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌, కొరటాల కాంబో వస్తున్న చిత్రం కాబట్టి సినీ ప్రియుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Pooja Hegde Dance: ఫ్రెండ్‌ సంగీత్‌లో డాన్స్ ఇరగదీసిన పూజా హెగ్డే.. వీడియోస్ వైరల్!

దేవర సినిమా నుంచి ఎన్టీఆర్‌ లుక్‌తో పాటు సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ల‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌గా.. అవి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇక సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న సినిమా గ్లింప్స్ విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను షేర్‌ చేసింది. దేవర సినిమా ఆడియో హ‌క్కులను ప్ర‌ముఖ మ్యూజిక్‌ సంస్థ ‘టీ సిరీస్’ సొంతం చేసుకుందని తెలిపింది. అయితే ఎంత ధ‌ర‌కు అమ్ముడైన‌ విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే భారీ ధరకే అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దేవర సినిమాకు త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments