గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న యాక్షన్ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ కోసం వెయిట్ చేస్తున్నారు.. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. గోవా షెడ్యూల్ లో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు జాన్వీ కపూర్ తో ఓ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.. ఈరోజు ఈ సినిమా సెట్ నుంచి ఓ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్నారు. ఎలాంటి అప్డేట్ లేకుండా వర్కింగ్ స్టిల్ తో ఎన్టీఆర్ ఫోటోని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఆ ఫొటోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు..
దేవర సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.. మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న విడుదల చేయబోతున్నారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా నుంచి సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం..
Making waves in Goa !! 🌊🎵 #Devara @tarak9999 #KoratalaSiva #JanhviKapoor @NANDAMURIKALYAN #RajuSundaram @sabucyril @RathnaveluDop @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie @Tseries @Tseriessouth pic.twitter.com/G81lHl1EM8
— NTR Arts (@NTRArtsOfficial) March 22, 2024