Janhvi Kapoor : అమ్మ చెప్పింది.. అలాంటి పాత్రలు అస్సలు చేయను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor : ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైన సంగతి అందరికి విదితమే. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు, ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డుల కలెక్షన్లను సాధిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన దేవర, వర పాత్రలు కూడా అందర్ని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి.
Read Also:Pakistan: నస్రల్లా మృతిపై పాకిస్థాన్‌లో నిరసన.. హింసాత్మకంగా మారిన ఆందోళనలు
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
తంగం పాత్రలో కనిపించిన జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువ ఉందని.. ఆమెను కేవలం గ్లామర్ కోసమే సినిమాలో తీసుకున్నారని అంటున్నారు. ఆమెలోని నటనను కొరటాల వాడుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. తంగం పాత్రతో చెప్పించిన డైలాగులు కూడా అంతగా యాప్ట్‌గా లేవంటున్నారు సినీ జనాలు. తంగం పాత్రపై శ్రద్ధ పెట్టి, ఆ పాత్రను కూడా ఆకర్షణీయంగా డిజైన్ చేస్తే సినిమాకు మరింత ప్లస్ అయ్యేందని సూచిస్తున్నారు రివ్యూవర్స్. జాన్వీ కూడా ఈ విషయంలో కాస్త ఇంట్రెస్ట్ చూపాలని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Read Also:iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్‌ను అస్సలు మిస్ కావొద్దు!
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నేను జుట్టు లేకుండా నటించాల్సి వస్తే అస్సలు చేయను. అలాంటి పాత్రలను నేను ఒప్పుకోను. ఎంత కష్టమైనా భరిస్తాను కానీ జుట్టు మాత్రం కట్ చేసుకోను. నా మొదటి సినిమా దఢక్ కోసం కొంచెం జుట్టు కట్ చేశాను. అప్పుడు అమ్మ కోపగించుకుంది. ఏ పాత్ర కోసం అయినా సరే జుట్టును మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. ఆమె మాట నేను దాటను. అందుకే జుట్టు లేకుండా ఉండే పాత్రలు వస్తే చేయను అని తెలిపింది. దీంతో తన దగ్గరికి తీసుకు వచ్చే పాత్రల్లో జుట్టు కట్ చేసుకోవాలని చెప్పే పాత్రలు ఉంటే రావొద్దని డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చేసింది దర్శక నిర్మాతలకు. దేవర తర్వాత జాన్వీ రామ్ చరణ్ తో ఆర్సీ16 సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుంది.
- Tags
- Devara
- janhvi
- Janhvi Kapoor
- Sridevi
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?