NTV Telugu Site icon

Janhvi Kapoor : అమ్మ చెప్పింది.. అలాంటి పాత్రలు అస్సలు చేయను

Janvii (2)

Janvii (2)

Janhvi Kapoor : ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైన సంగతి అందరికి విదితమే. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు, ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డుల కలెక్షన్లను సాధిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించిన దేవర, వర పాత్రలు కూడా అందర్ని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రంతోనే టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ పాత్రపై మాత్రం నెగిటివ్ కామెంట్స్‌ వినపడుతున్నాయి.

Read Also:Pakistan: నస్రల్లా మృతిపై పాకిస్థాన్‌లో నిరసన.. హింసాత్మకంగా మారిన ఆందోళనలు

తంగం పాత్రలో కనిపించిన జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువ ఉందని.. ఆమెను కేవలం గ్లామర్ కోసమే సినిమాలో తీసుకున్నారని అంటున్నారు. ఆమెలోని నటనను కొరటాల వాడుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. తంగం పాత్రతో చెప్పించిన డైలాగులు కూడా అంతగా యాప్ట్‌గా లేవంటున్నారు సినీ జనాలు. తంగం పాత్రపై శ్రద్ధ పెట్టి, ఆ పాత్రను కూడా ఆకర్షణీయంగా డిజైన్‌ చేస్తే సినిమాకు మరింత ప్లస్‌ అయ్యేందని సూచిస్తున్నారు రివ్యూవర్స్‌. జాన్వీ కూడా ఈ విషయంలో కాస్త ఇంట్రెస్ట్‌ చూపాలని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Read Also:iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్‌ను అస్సలు మిస్ కావొద్దు!

జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నేను జుట్టు లేకుండా నటించాల్సి వస్తే అస్సలు చేయను. అలాంటి పాత్రలను నేను ఒప్పుకోను. ఎంత కష్టమైనా భరిస్తాను కానీ జుట్టు మాత్రం కట్ చేసుకోను. నా మొదటి సినిమా దఢక్ కోసం కొంచెం జుట్టు కట్ చేశాను. అప్పుడు అమ్మ కోపగించుకుంది. ఏ పాత్ర కోసం అయినా సరే జుట్టును మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. ఆమె మాట నేను దాటను. అందుకే జుట్టు లేకుండా ఉండే పాత్రలు వస్తే చేయను అని తెలిపింది. దీంతో తన దగ్గరికి తీసుకు వచ్చే పాత్రల్లో జుట్టు కట్ చేసుకోవాలని చెప్పే పాత్రలు ఉంటే రావొద్దని డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చేసింది దర్శక నిర్మాతలకు. దేవర తర్వాత జాన్వీ రామ్ చరణ్ తో ఆర్సీ16 సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుంది.

Show comments