NTV Telugu Site icon

Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీ-రిలీజ్ గెస్టులు వీరే..!

New Project (20)

New Project (20)

Devaki Nandana Vasudeva : ‘హీరో’ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా. తన రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచించారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రమోషవ్స్ లో భాగంగా వివిధ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.

Read Also:Ram Charan : ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్

వాస్తవానికి ఈ సినిమా నవంబరు 14న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ రోజు తమిళ హీరో సూర్య నటించిన కంగువ, వరుణ్ రేజ్ మట్కా రిలీజ్ అవుతుండడంతో భారీ సినిమాల మధ్య పోటి ఎందుకని భావించి రిలీజ్ ను వారం రోజులు వేశారు. దీంతో దేవకి నందన వాసుదేవ నవంబర్ 22 న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. 22న విశ్వక్ సేన్ మెకానిక్ రాకి సినిమాతో పోటీగా రిలీజ్ కానుంది దేవకీ నందన వాసుదేవ.

Read Also:Ponguleti Srinivas Reddy : మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుంది

ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 19న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా ఆరుగురు ముఖ్య అతిథులు రాబోతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా, స్టార్ డైరెక్టర్స్ బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ అజయ్ భూపతి.. ఇలా ఏకంగా ఆరుగురు ఫేమస్ సెలబ్రిటీలు రాబోతున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవదత్తా నాగే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Show comments