NTV Telugu Site icon

Riyan Parag: సెంచరీలు కొట్టిన ట్రోల్స్ ఆగడం లేదు.. ఎందుకు?

Riyan

Riyan

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ పేలవమైన ప్రదర్శన కారణంగా తరచూ ట్రోల్ అవుతుంటాడు. కానీ రియాన్ దేవధర్ ట్రోఫీలో తనపై వచ్చిన ట్రోల్స్కు తగిన సమాధానం ఇచ్చాడు. రియాన్ దేవధర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ.. 5 రోజుల్లో రెండు సెంచరీలు సాధించాడు. మంగళవారం వెస్ట్ జోన్‌పై రియాన్ 68 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇది అతనికి రెండో సెంచరీ. అంతకుముందు జూలై 28న నార్త్ జోన్‌పై సెంచరీ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Heart Emoji: వాట్సాప్‌లో హార్ట్‌ సింబల్‌ పంపితే చిక్కులే.. ఐదేళ్ల జైలు, భారీ జరిమానా..!

దేవధర్ ట్రోపీలో రియాన్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి 5 సిక్సర్లు మరియు 6 ఫోర్లు కొట్టి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ చేసినప్పటికీ రియాన్ పై క్రికెట్ అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. మంచి బౌలర్లపై రియాన్ ఎప్పుడూ విఫలమవుతాడని.., బౌలింగ్ బలహీనంగా ఉన్న చోట మాత్రమే పరుగులు సాధిస్తాడని అభిమానులు అంటున్నారు.

Viral Video : వామ్మో బామ్మో.. ఈ వయస్సు ఇది అవసరమంటావా?

అయితే రియాన్ పరాగ్ ఆడిన సెంచరీ ఇన్సింగ్స్ బలమైన బౌలింగ్ లైనప్‌పైనే. రాజవర్ధన్ హంగర్‌గేకర్, షమ్స్ ములానీ, నాగాస్వాలా వంటి బౌలర్లపై దూకుడుగా ఆడాడు. అతడు మెరుపు బ్యాటింగ్ చేయడం వల్లే ఈస్ట్ జోన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 319 పరుగులు చేసింది. రియాన్ పరాగ్‌లో చాలా ట్యాలెంట్ ఉన్నప్పటికీ.. పెద్ద మ్యాచ్ ల్లో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన అతను.. ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశాలు వచ్చాయి. అయితే అతని పేలవ ప్రదర్శనతో అభిమనులను నిరాశపరిచాడు. ఐపీఎల్ 2023లో 7 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 78 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పరాగ్ అభిమానుల హృదయాలను గెలుచుకోవాలంటే.. పెద్ద మ్యాచ్ ల్లో తన ట్యాలెంట్ చూపించాల్సిందే.