NTV Telugu Site icon

Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలో ఘటన

Gooda Rail

Gooda Rail

Goods Train: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పన్వెల్-వసాయి మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ప్రాథమిక సమాచారం. పన్వేల్-కలాంబోలి సెక్షన్‌లో మధ్యాహ్నం 3:05 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శివరాజ్ మనస్‌పురే తెలిపారు.

Read Also: అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న సన్యా మల్హోత్రా

ఓ వార్త కథనం ప్రకారం.. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ నుండి పాల్ఘర్ జిల్లాలోని వాసాయికి వెళ్తున్న గూడ్స్ రైలు.. బ్రేక్ వ్యాన్‌తో సహా నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అక్కడ పరిస్థితిని పరిష్కరించడానికి.. కళ్యాణ్, కుర్లా స్టేషన్ల నుండి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ART) పంపించారు. అనంతరం ప్రమాద స్థలంలో డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM), ఇతర అధికారులు పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు.

Read Also: Swayambhu : స్వయంభు కోసం కత్తి సాము నేర్చుకుంటున్న నిఖిల్..

ఇదిలా ఉంటే గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో వచ్చే ఐదు ప్యాసింజర్ రైళ్లు కొంకణ్-ముంబై మార్గంలో వివిధ పాయింట్ల వద్ద తాత్కాలికంగా నిలిచిపోయాయి. మరోవైపు పన్వెల్-CSMT సెక్షన్ మధ్య నవీ ముంబై సబర్బన్ సర్వీసులు ఎథావిధిగా నడిచాయి.