డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పట్ల హర్యానా ప్రభుత్వం మరోసారి దయ చూపింది. ఇద్దరు భక్తులపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఈయనకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రస్తుతం జైల్లోనే ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా డేరా సచ్చా సౌదా ఆశ్రమ అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా 13వ సారి జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఉదయం, బాబాను పోలీసు రక్షణలో సిర్సా డేరాకు తీసుకువచ్చారు. సమాచారం ప్రకారం.. ఈసారి రామ్ రహీమ్ సిర్సాలో ఉన్న డేరాలోనే ఉంటాడు. గతంలో ఢిల్లీ ఎన్నికలకు ముందే.. అతను పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత అతనికి 30 రోజుల పెరోల్ లభించింది. ఇప్పుడు అతను 21 రోజుల సెలవుపై బయటకు వచ్చాడు. ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సా ఆయనను తీసుకెళ్లడానికి రోహ్‌తక్ జైలుకు చేరుకుంది. డేరా బాబాకు ఇలా పెరోల్ లభించడం ఇది 13వసారి.
READ MORE: Thatikonda Rajaiah : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహం.. కడియం శ్రీహరిపై హాట్ కామెంట్స్
రామ్ రహీమ్ జైలు నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చాడు?
డేరా బాబా ఇప్పటికే 13సార్లు జైలు నుంచి తాత్కాలికంగా బయటకు వచ్చారు. మొదట 2020లో ఒకరోజు పెరోల్ మంజూరు లభించింది. ఆ తర్వాత 2021లో 12 గంటలు, 2022లో 21 రోజులు,30రోజు పెరోల్‌కు మంజూరు లభించింది. 2023లో 40రోజుల పెరోల్‌ను రెండు దాఫాలుగా, 2024లో 50రోజులు, 20రోజుల పెరోల్ లభించింది. డేరా బాబా జైలు నుంచి విడుదల కావడం ఈ ఏడాదిలోనే ఇది రెండోసారి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే జనవరిలో 30 రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు.
