Dera Baba: అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హర్యానాలోని సనారియా జైలులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ అంటే గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన కోర్టు ఇతడికి పెరోల్ మంజూరు చేసింది. డేరా చీఫ్ 40 రోజుల పెరోల్ గత ఏడాది నవంబర్ 25న ముగిసింది. మళ్ళీ తాజాగా 40 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయబడింది. డేరా బాబాకు నిబంధనల ప్రకారమే పెరోల్ ఇచ్చినట్లు రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపారు.
Read Also: Vande Bharat: ‘వందేభారత్’ ట్రైన్ పై మళ్లీ దాడి.. ఏమైంది జనాలకు
ఇదే విషయంపై హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా, డేరా చీఫ్ తాజా పెరోల్ అభ్యర్థనపై వ్యాఖ్యానిస్తూ.. 40 రోజుల పెరోల్ కోరుతూ డేరా బాబా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ పెరోల్ వ్యవధిలో..గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జనవరి 25న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెప్పా రు. అక్టోబర్ 14న విడుదలైన ఆయన ఉత్తరప్రదేశ్‌లోని తన బర్నావా ఆశ్రమానికి వెళ్లారు. అక్టోబరు-నవంబర్‌లోని పెరోల్ సమయంలో బర్నావా ఆశ్రమంలో అనేక ఆన్‌లైన్ ‘సత్సంగ్’లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు హర్యానాకు చెందిన బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.
Read Also: Cane Toad: వామ్మో.. ఇది విన్నారా.. ఆ కప్ప బరువు ఏకంగా 2.7కిలోలంట
ఇదే విషయంపై సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తరచుగా పెరోల్ ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ.. సుమారు మూడు దశాబ్దాలుగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీలను వారి శిక్షలు పూర్తయినా విడుదల చేయడం లేదని SGPC అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామీ ఆరోపించిన సంగతి తెలిసిందే.