Site icon NTV Telugu

Deputy Speaker Padma Rao: అవన్నీ పుకార్లే.. ఊపిరి ఉన్నంతకాలం టీఆర్ఎస్ తోనే

Sec Padma Rao Goud

Sec Padma Rao Goud

పార్టీమారతానని తనపై అసత్య ప్రచారం సాగుతోందన్నారు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసత్యం వీధులు దాటుతోంది. ఊపిరి ఉన్నంత కాలం టిఆర్ఎస్ ను వదిలేది లేదు. ఉత్తర ఖండ్ కు వెళ్ళా… నాకు చాలా ఫోన్లు వచ్చాయి. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా చనిపోతే వెళ్లి కలిసి వచ్చాము. కేటీఆర్ ను క్యాంపు ఆఫీసుకు వెళ్లి కలిసి వచ్చా. డిప్యూటీ స్పీకర్ కు కొన్ని నిబంధనలు ఉంటాయి. అన్ని రాజకీయాలు డైరెక్టర్ చేయలేం అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.

నేను ఆత్మ సంతృప్తితో ఉన్నా… నేను సికింద్రాబాద్ లో ఉంటా. నన్ను హైకమాండ్ ఆదేశిస్తే జపాన్ లో కూడా పోటీ చేస్తా. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తా. మునుగోడులో మేమే గెలుస్తాం. కేంద్రం నుంచి నా నియోజకవర్గంకు ఎలాంటి నిధులు రాలేదు. గవర్నర్ బిల్లులు ఆమోదించక తప్పదు… కొన్ని ఫైల్స్ తొందరగా రావు. నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయి. మేము తెలంగాణలో ఉన్నాం. గవర్నర్ పాకిస్తాన్ లో లేదు కదా. నా రాజకీయ వారసుడు రామేశ్వర్ అని అంటున్నారు. కాలమే నిర్ణయిస్తుంది. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం లేదని బూర నర్సయ్య గౌడ్‌ కు తెలియదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? అన్నారు పద్మారావు గౌడ్.

Read Also: Kantara: ఐఎండీబీ రేటింగ్స్‌లో ‘కాంతార’ సంచలనం

పూర్తిగా ఉద్యమకారులతోనే ప్రభుత్వాన్ని నడుపలేం. ప్రభుత్వానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాల మేరకు ఉపయోగించుకుంటుంది. కిషన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అసెంబ్లీలో పక్క పక్క సీట్ల కూర్చునే వాళ్ళం.నా కూతురు పెళ్లికి కార్డు ఇచ్చా… అప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. కిషన్ రెడ్డి మా ఇంట్లో అర గంట ఉన్నారు. నా కూతుర్ని ఆశీర్వదించారు. కిషన్ రెడ్డికి ఏదో ఉంది. నాకు అంటుతది అని ఉంటదా?ఎవరెవరు ఎక్కడ ఎవర్ని కలుస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది. నాకైమనా ట్రాన్స్ మీటర్ ఉంటదా? అన్నారు పద్మారావు గౌడ్.

Read Also: Special Story on RATAN TATA: రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులోనూ.. అదే ఉత్సాహం.. అదే ముందుచూపు..

Exit mobile version