NTV Telugu Site icon

Pawan Kalyan: పంచాయితీల నిధుల విషయంలో డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

Pawan

Pawan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయితీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఇచ్చేదని.. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.25 వేలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.10 వేల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయితీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కనీసం పంద్రాగష్టు, రిపబ్లిక్ డే నిర్వహణ కోసం తగినన్నీ నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. నామ్ కే వాస్త్ గా రూ. 100, రూ. 150లు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీలో పంచాయితీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు వారికి నిధుల కేటాయింపు పెంచుతున్నామన్నారు.

Read Also: Murari 4K: ఇదేందయ్యా ఇదీ.. కొత్త సినిమా కంటే మురారి రీ రిలీజ్ ఎక్కువ కొల్లగొట్టిందే?

అలాగే.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని 13 వేల 326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలి? ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలన్న విషయాల్ని గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము చేపట్టే పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో కలిసి సభ జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Show comments