రాజధాని నిర్మాణానికి 34000 ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమస్కారాలు తెలిపారు. అమరావతి రైతులు ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారని.. రోడ్ల మీదకు వచ్చి, ముల్లకంచెలపై కూర్చొని, పోలీసులు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. 2000 రైతుల ప్రాణాలు కోల్పోయాయని చెప్పారు. రైతులు నలిగి బాధపడి, తమ కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? అని చాలామంది మహిళలు రైతులు ఆ రోజుల్లో తను అడిగిన సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుస్తుందా? అని రైతులు అడిగినట్లు తెలిపారు. మోడీకి ఏదీ ఉండదని.. అమరావతి శాశ్వత రాజధాని అని మోడీ నమ్మారని ఆరోజు చెప్పినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మరోసారి మోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణం పున ప్రారంభం జరుగుతుందన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఈ రాజధాని ఒక హబ్ లాంటిదని, ఓ ఇల్లు లాంటిదన్నారు.
READ MORE: India Pakistan: పాకిస్తాన్‌పై రెండు ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..!
రైతులు పడ్డ బాధలను గుర్తు చేసిన డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ నాటి రోజులను గుర్తు చేశారు. “రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ఐదేళ్లలో మీరు పడ్డ బాధలు, మీరు తిన్న లాఠీ దెబ్బలు, మీరు అనుభవించిన అవస్థలు అన్ని మా మనసులో ఉన్నాయి. దివ్యాంగులను కూడా లాఠీతో కొట్టడం, నా గుండెల్లో ఇప్పటివరకు ఇలాగే ఉంది. ఆ బాధను నేను మర్చిపోలేను. దీనికి సజీవ సాక్షి నేడు ఈ అమరావతి రాజధాని పునః ప్రారంభం. ఆరోజు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటాల త్యాగానికి జవాబుదారీ తరంగా ఉంటాం. అమరావతి మహిళా రైతుల పాత్ర ప్రత్యేకమైనది.” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
READ MORE: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
“అమరావతి రైతులు గత ఐదేళ్లు పోరాడారని.. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మాటిచ్చాం.. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచి పెట్టేసింది.. అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు.. అమరావతి ప్రపంచస్థాయి రాజధానికి మారుతుంది.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని మోడీ అమరావతి పునఃనిర్మాణ సభకు వచ్చారు.. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతుంది.. మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వని కారణంగా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడింది.. 20 ఏళ్ల ముందే భవిష్యత్‌ను ఊహించి ప్రణాళికతో ముందుకు వెళ్ల గల నేత చంద్రబాబు. అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
