NTV Telugu Site icon

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలి.. ఆదేశం

Pawan

Pawan

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు.

Read Also: J-K: భారత్‌పై కుట్రకు పాకిస్థాన్ భారీ ప్లాన్..150 మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం..

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అన్ని శాఖలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం పాల్గొని తనిఖీలు చేపట్టాలని, సమస్యలను గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ క్రమంలో.. కాకినాడ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని అక్కడ పరిస్థితుల తనిఖీ చేస్తూ, సమస్యలను గుర్తిస్తూ నివేదికను సిద్ధం చేసేందుకు పనిచేస్తున్నారు. ఈ నివేదికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు.

Read Also: Vishwambhara : మెగా ఫాన్స్ కి దసరా బొనాంజా.. గెట్ రెడీ

పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్‌ కల్యాణ్‌.. భారీ మెజార్టీతో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు.. ఇక, డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కీలక శాఖలు దక్కించుకున్న ఆయన.. తన శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ పర్యటించారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి.. కొన్ని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన విషయం విదితమే.

Show comments