AP Deputy CM Pawan Kalyan Chamber: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే రోజు ఖరారైంది. జూన్ 19వ తేదీ బుధవారం రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న శాఖలను తమకు కేటాయించారంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించే విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఛాంబర్ వివరాలు కొరకు కింది వీడియో చుడండి..