Deputy CM Pawan Kalyan: అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. నేపాల్ దేశానికి 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం అక్రమంగా వెళ్లినట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. నేపాల్‌కు అక్రమంగా తరలిన ఎర్రచందనాన్ని తిరిగి రప్పించడంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నది జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తానని పవన్ వెల్లడించారు.
Read Also: GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..