NTV Telugu Site icon

Dy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాట్ కామెంట్స్

Narayana Swamy

Narayana Swamy

Dy CM Narayana Swamy: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ దేశానికి ఏమీ సేవ చేయలేదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని పవన్ కల్యాణ్‌ చంద్రబాబుతో కలుసుకున్నాడని నారాయణ స్వామి అన్నారు. పవన్ కల్యాణ్‌ గతంలో చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టాడని.. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఒక్కటొయ్యారన్నారు. ఇక్కడ జరిగిందాన్ని వీడియో తీసి పెడితే పవన్ కల్యాణ్, చంద్రబాబు పకపక నవ్వుకునేదన్నారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని.. తాను పూలమాల వేసుకునేందుకు కాదు.. చెప్పు దెబ్బలు తీసుకునే దానికి కూడా తాను రెడీ అన్నారు. తాను తప్పు చేయననని.. ఎవరి దగ్గర డబ్బు తీసుకోనన్నారు.

Read Also: Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు

బుధవారం డిప్యూటీ సీఎంకు కార్వేటినగరంలో నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. ఓ మహిళ తమకు ఉచిత రేషన్‌ బియ్యం ఇస్తానన్నారని కాలీ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడింది. ఇక, మా వీధిలో త్రాగునీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. మా వీధిలో మురికి కాలువలో మురికి నీరు అస్తవ్యస్తంగా ఉంది.. ఎవరికీ చెప్పినా పట్టించుకునే వారు లేరన్నా రు.. ఇలా సమస్యలు చెబుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వా మితో హేమలత అనే మహిళ వాగ్వాదానికి దిగింది.

ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయిం ది.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ మహిళ వెనక్కి తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. కాగా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నా రు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్య టించడం .. తాము అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృ ద్ధి గురించి చెప్పడం.. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్ని కలు.. ఇతర కార్యక్రమాలతో కొన్ని రోజులు ఈ కార్యక్రమానికి బ్రేక్‌లు పడగా.. మళ్లీ నిర్వ హించాలనే ఈ మధ్యే ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే.

Show comments