Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anakapalli Deputy Cm Mutyala Naidu Daughter And Son Fight In Madugula Assembly

Budi Muthyala Naidu: డిప్యూటీ సీఎం ఇంట్లో రాజకీయ కుంపటి..! ఒకే స్థానం నుంచి బరిలోకి అక్క, తమ్ముడు..!

Published Date :April 24, 2024 , 9:57 pm
By Sudhakar Ravula
Budi Muthyala Naidu: డిప్యూటీ సీఎం ఇంట్లో రాజకీయ కుంపటి..! ఒకే స్థానం నుంచి బరిలోకి అక్క, తమ్ముడు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Budi Muthyala Naidu: ఏపీ డిప్యూటీ సీఎం ఇంట్లో రాజకీయ కుంపటి రాజుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది పెద్దల మాట. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు రచ్చ గెలవగలిగినా… ఇంటి పోరు మాత్రం ఆయన్ని కలవరపెడుతోంది. కారణం.. రాజకీయ ఆధిపత్యం కోసం వారసుల మధ్య జరుగుతున్న ఫైట్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఉంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ముత్యాలనాయుడు. ఆయనకు ఊహించిన దానికంటే ఉన్నత పదవులే లభించాయి. 2014లో తొలిసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ హోదాతో విప్ పదవి లభించింది. కేబినెట్‌ పునర్వ్యస్ధీకరణలో ఏకంగా ముత్యాల నాయుడిని డిప్యూటీ సీఎం చేసింది పార్టీ హైకమాండ్‌. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ-వెలమ నేతగా ముత్యాల నాయుడికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి దగ్గరైంది వైసీపీ.

Read Also: Konda Sangeetha Reddy: భారీ మెజార్టీతో కె.వి.ఆర్ గెలుపు ఖాయం..

ప్రస్తుత ఎన్నికల్లో తన వ్యూహానికి మరింత పదునుపెట్టిన వైసీపీ ముత్యాలనాయుడిని అనకాపల్లి లోక్‌సభ బరిలో నిలిపింది. మాడుగుల అసెంబ్లీ టికెట్‌ ఆయన కుమార్తె ఈర్లె అనురాధకు కేటాయించింది. తండ్రీకూతుళ్లు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదని భావించిన సమయంలో ముత్యాలనాయుడికి సొంత కొడుకు రవి షాక్‌ ఇచ్చాడు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రవి. ఈర్లె అనూరాధకు మహిళా కోటా, తండ్రి వారసత్వం కలిసి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం ఖరారైంది. అదే సమయంలో ముత్యాల నాయుడు కుమారుడు రవి తండ్రి నీడ తనపై పడకుండా రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైసీపీలో జిల్లా నుంచి రాష్ట్రస్ధాయి నాయకత్వాన్ని తరచూ కలుస్తూ అవకాశం కోసం ఎదురు చూశారు రవి. అలాగని తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించకపోయినప్పటికీ వారసత్వం విషయంలో రాజీపడలేనని చాలా కాలం క్రితమే ప్రకటించారు. దాంతో మాడుగులలో అక్కాతమ్ముళ్ల మధ్య పోరు ఖరారైంది. ఇప్పుడు ఎవరి విజయావకాశాలను ఎవరు దెబ్బతీస్తారనేది ఆసక్తిగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Daughter Anuradha
  • Deputy CM Budi Muthyala Naidu
  • deputy cm mutyala naidu

తాజావార్తలు

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

  • Jeevan Reddy : అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం..

  • Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..

  • Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!

ట్రెండింగ్‌

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions