NTV Telugu Site icon

Bhatti Vikramarka: మహా శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం.. చిన్న నాటి మిత్రులతో కలసి..!

Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సబీక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేయించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో పాల్గొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి డిప్యూటీ సీఎం కలియతిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి.. మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు.