NTV Telugu Site icon

Bhatti Vikramarka: ప్రజాభవన్లో ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

Batti

Batti

Bhatti Vikramarka: హైదరాబాద్ నగరంలోని ప్రజా భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు విషెస్ చెబుతున్నారు. ఇక, ప్రజా భవన్ లోని పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను యాదగిరిగుట్ట వేద పండితులు, హైదరాబాదులోని ప్రముఖ దేవాలయాల ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.

Read Also: Andhra Pradesh: ఏజెన్సీలో తీరని కష్టాలు.. డోలీలో ఆస్పత్రికి గర్భిణీ..

కాగా, ప్రజా భవాన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో పార్టీ శ్రేణులు, అభిమానులు సత్కరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో 50 కిలోల కేకును డిప్యూటీ సీఎం కట్ చేశారు. పార్టీ శ్రేణులు అభిమానుల రాకతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ బీర్ల ఐయిలయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, ఐఏఎస్ అధికారులు హనుమంతరావు, సుశీల్ శర్మ, అడిషనల్ డీజీ సునీల్ కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.