Site icon NTV Telugu

Bhatti Vikramarka: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒరిస్సాకు డిప్యూటీ సీఎం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం (రేపు) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా ఆస్తులు ఇవే!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో మూడు దఫాలుగా ప్రచారం నిర్వహించారు. కటక్ లో ఒకరోజు, భువనేశ్వర్ లో రెండు రోజులపాటు, రాయగడ పార్లమెంటు పరిధిలో రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించారు. తాజాగా నాలుగోసారి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. కాగా.. తెలంగాణలో సోమవారం లోక్ సభ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇప్పటికీ 4 దశలుగా పోలింగ్ పూర్తయింది.

Phalsa Health Benefits: వేసవిలో ఫాల్సా పండ్లు తినండి.. గుండెకు ఎంతో మంచిది..

Exit mobile version