Bhatti Vikramarka: వస్తువులు, సేవల పన్ను (GST) రేట్ల సవరణ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జీఎస్టీ పన్నుల తగ్గింపు, దాని ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరాలనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని స్పష్టం చేశారు.
Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళ దారుణ హత్య.. అత్యాచారం చేశారా?
విధానపరమైన నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా.. వాటి ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందాలని ఆయన అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ఈ నిర్ణయం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకున్నామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు, రైతులకు ఉపయోగపడే వస్తువులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Arogyasri: అర్ధరాత్రి నుండి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. డిమాండ్స్ ఇలా!
జీఎస్టీ తగ్గించిన వస్తువుల ధరల వివరాలను వ్యాపారులు తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. షోరూమ్‌ల ముందు కచ్చితంగా రేట్ల ధర పట్టికలు పెట్టాలని.. అప్పుడే, ప్రజలకు ప్రభుత్వ నిర్ణయంపై అవగాహన వస్తుందని ఆయన కోరారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశంపైన అయినా చర్చించడానికి సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. వ్యాపారస్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, తక్షణమే స్పందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో వ్యాపారులు కలిసి పనిచేసి జీఎస్టీ సవరణ ప్రయోజనాలను ప్రజలకు చేర్చాలని ఆయన కోరారు.
