NTV Telugu Site icon

Telangana Budget: రేపే తెలంగాణ బడ్జెట్‌.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి

Tg

Tg

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో రేపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. 2 లక్షల 95 వేల కోట్ల నుంచి 3 లక్షల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.. రాష్ట్ర బడ్జెట్ 2024-25 కు ఆమోదం తెలుపనుంది కేబినెట్‌.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టనునుండగా.. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఓటాన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురానుంది. ఇటు బడ్జెట్‌ సమావేశాలు మరో రెండ్రోజులు పొడిగించింది ప్రభుత్వం. ఆగస్టు 2వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి.

Read Also: Indian Navy: భారత నేవీ సాహసోపేత ఆపరేషన్‌.. ప్రమాదంలో ఉన్న చైనీయుడికి సాయం

మరోవైపు.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు చేయలేదంటూ తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ టాపిక్‌పై చర్చించబోమంటూ బీజేపీ వాకౌట్ చేసి వెళ్లిపోయింది. అధికార పార్టీ, విపక్ష బీఆర్ఎస్ మాత్రమే డిస్కస్ చేశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని సభలో హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ అంటే.. అందరం కలిసి దీక్ష చేద్దామని, ఆ దీక్షకు కేసీఆర్ కూడా రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ టాపిక్ మీద తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం డిమాండ్ చేశారు. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్‌ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రధాని మోడీ తన ఆస్తులు అమ్మి రాష్ట్రానికి డబ్బులివ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచే లక్షలకోట్ల పన్నుల నిధులు కేంద్రానికి వెళ్తోందన్నారు. అందులో నుంచే కొన్ని నిధులు రావాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాల్సిన ఫండ్స్ మాత్రమే అడుగుతున్నామన్నారు రేవంత్. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు.

Read Also: High Court: ఆ అధికారులపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం

బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై చర్చ జరుపుతున్న క్రమంలో సీఎం రేవంత్- ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ ఎందుకు సభకు రాలేదని సీఎం ప్రశ్నించారు. తమకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ దాకా ఎందుకని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దీంతో సభలో డైలాగ్ వార్ పీక్స్‌కి చేరింది. కేసీఆర్‌ కుటుంబం మొత్తం సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు సీఎం రేవంత్‌. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చిందే మీ అభిప్రాయమా అంటూ ప్రశ్నించారు. తండ్రి పేరు, తాత పేరు చెప్పుకుని తాను సభలోకి రాలేదన్నారు సీఎం. సీతారామ ప్రాజెక్టుకు వేలకోట్ల ఖర్చుపెట్టినా ఒక్క ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటరిచ్చారు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. 1450 కోట్లతో పూర్తయ్యే ఇందిరా, రాజీవ్ సాగర్‌ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి, 20వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. హైదరాబాద్ పవర్ సర్కిళ్లను అదానీకి అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఇచ్చారన్న కేటీఆర్ మాటలకు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాంటి ప్రకటనలే ఇవ్వలేదన్నారు. తెలంగాణకోసం పుట్టామని గట్టిగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్.. పదేళ్లు అదిచేశాం ఇది చేశాం అని చెప్పుకోవడంతోనే సరిపోయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి, ఇతర కోల్ బ్లాక్స్‌ ఆక్షన్‌ పెట్టడానికి కారణం బీఆర్ఎస్‌ నేతలు కాదా అని ప్రశ్నించారు. 2015లో కోల్‌బ్లాక్స్‌కు సంబంధించిన బిల్లు పాసవ్వడానికి బీఆర్ఎస్ ఎంపీలు సహకరించారని ఆరోపించారు భట్టి.