NTV Telugu Site icon

Bhatti Vikramarka: పేదలకు మేలు చేయాలని పథకాల అమలుకు నిర్ణయం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

సచివాలయంలో ఈరోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రధాన పథకాలను ఈనెల 26వ తేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించామన్నారు. భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ.. రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించిన మీదటే.. ఈ పథకాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే.. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశామని.. ఈ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు.

Read Also: Mental Health : ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు ? పక్కన ఉంటే మీరు గుర్తించొచ్చు

లబ్ధిదారుల ఎంపికను, ప్రతీ ఉమ్మడి జిల్లాలో ఇంఛార్జి మంత్రులు ఇందిరమ్మ కమిటీలతో చర్చించిన మీదటే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం నిర్ణయించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీల ద్వారా ప్రకటించాలని అన్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో రూ.22000 కోట్ల రైతు రుణ మాఫీలను చేశాం.. ఈ వివరాలను కూడా ప్రతీ గ్రామంలో ప్రకటించాలని తెలిపారు. ఈ నాలుగు పథకాలను సంబంధించి సవివరమైన మార్గ దర్శకులతో ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేయాలి.. ఈ పథకాలపై జిల్లాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.

Read Also: Shraddha Srinath: బాలయ్యని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది!

Show comments