NTV Telugu Site icon

Budget Meetings : ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీ లతో భేటీ కానున్నారు. ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈనెల 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈనెల 22న ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ పై చర్చించనున్నారు. ఈనెల 26న నీటిపారుదల, పౌరసరఫరాలు, అటవీ, దేవాదాయశాఖలపై సమావేశం నిర్వహించనున్నారు.

 

ఈనెల 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటకశాఖల ప్రతిపాదనలపై సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న శాఖలపై ఈనెల 28 నుంచి జూలై 1 వరకు సమావేశాలు జరుగనున్నాయి. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆయాశాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనలను క్షుణ్ణంగా సమీక్షించాలని ఆర్థికశాఖ పేర్కొంది. ప్రభుత్వ ప్రాధాన్యత, ఆయా పథకాల కొనసాగింపు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. తెలంగాణ సర్కార్ ప్రాధాన్య పథకాలకు పద్దు ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని ఆర్థికశాఖ వెల్లడించింది.