సీజనల్ వ్యాధుల కట్టడి పై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (DH) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సీజనల్ వ్యాధుల బాధితుల వివరాలను కంట్రోల్ రూమ్ కు తెలియచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందేలా కంట్రోల్ నుండి సూచనలు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై స్పెషల్ డ్రైవ్ ను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Actor Darshan: బెంగళూర్ జైలు నుంచి బళ్లారి జైలుకి దర్శన్ తరలింపు..
తెలంగాణలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు.. డెంగ్యూ, చికున్‌గున్యా , మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా జ్వరాలతో సహా దాదాపు అన్ని ప్రధాన సీజనల్ వ్యాధులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగాయి. వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. డెంగీ, చికున్‌గున్యా వంటి జబ్బులతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. ఓవైపు ఉదయమంతా ఎండలు, సాయంత్రం కాగానే వర్షాలతో భిన్న వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
Read Also: NDA: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే..
