సీజనల్ వ్యాధుల కట్టడి పై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం ఇచ్చారు.