NTV Telugu Site icon

MLA Abbaya Chowdary: ప్రత్యర్థి ఎవరనేది అనవసరం.. 50 వేల మెజార్టీతో గెలుస్తా..!

Abbaya Chowdary

Abbaya Chowdary

MLA Abbaya Chowdary: దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.. ప్రత్యర్థి ఎవరు అనేది అనవసరం.. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలడమే తన టార్గెట్‌ అంటున్నారు.. పదవుల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరిస్తే ప్రజలకు గౌరవిస్తారని తెలిపారు.. ప్రజలకు ఆశీర్వదించినంత కాలమే ఎవరైనా రాజకీయ నాయకులుగా కొనసాగుతారు.. చింతమనేని ప్రభాకర్‌లా అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు ఎవ్వరినైన పక్కన పెడతారు అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో దెందులూరులో ప్రత్యర్థి చింతమనేని అయినా? ఇంకా ఎవ్వరైనా? సరే విజయం నాదే అని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సవాల్‌ విసిరారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ దెందులూరులోనే సిద్ధం సభ పెట్టి ప్రకటించామన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు.. రాసిపెట్టుకొండి.. మే 30వ తేదీన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.