Site icon NTV Telugu

Air India Flight: రష్యాలో ఎయిర్‌ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్

Delhi-San Francisco Air India Flight Diverted To Russia After Engine Glitch

Delhi-San Francisco Air India Flight Diverted To Russia After Engine Glitch

Air India Flight: ఎయిరిండియాకు చెందిన విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్‌ఇండియా సిబ్బంది ఉన్నారు. రష్యా మగడాన్‌ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.

Read Also: Nepal PM Prachanda: సరిహద్దు సమస్య పరిష్కారానికి నేపాల్, భారత్ చర్చలు జరపాలి..

“ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI173 ఇంజిన్‌లో ఒకదానిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో ఉన్న విమానాన్ని దారి మళ్లించి రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు” అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా తమ తమ గమ్యస్థానాలు చేర్చేందుకు వీలైనంత త్వరగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. విమానాన్ని టెక్నికల్ సిబ్బంది పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version