Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఈ పేలుడులో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి పేలుడు జరిగిన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
READ ALSO: Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్‌లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!
భారీ పేలుడుతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమైయ్యాయి. ఈ పేలుడులో 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు.
