Delhi Blast: భారీ పేలుడు.. 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఈ పేలుడులో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి పేలుడు జరిగిన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
READ ALSO: Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్‌లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!
Also Read
- El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Karnataka: కర్ణాటకపై రాహుల్‌గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
- Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
భారీ పేలుడుతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమైయ్యాయి. ఈ పేలుడులో 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు.
తాజావార్తలు
-
Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్‌గా ఇలా చేసుకోండి..!
-
Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
-
El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!