Coldest Morning in Season: ఢిల్లీ సహా ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీలోని లోధి రోడ్‌లో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రోజు మొత్తంలో అతి తక్కువగా 2.8 డిగ్రీల ఉష్ణోగ్రతను ఢిల్లీ రిడ్జ్ వాతావరణ కేంద్రం నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. సఫ్దర్ జంగ్‌లో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచు కారణంగా రోడ్లు కనిపించకుండాపోయాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో శీతల వాతావరణం నెలకొంది. దట్టమైన పొగమంచు వల్ల పలు ప్రాంతాల్లో 50 మీటర్ల కన్నా దూరంలోని వాహనాలు కనిపించడం లేదు. దీనివల్ల రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలపై ప్రభావం పడుతోంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలో చలి తరంగాల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత తగ్గుతుందని ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయం గురువారం ప్రయాణికులందరికీ పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నవీకరించబడిన విమాన సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించవలసిందిగా అధికారులు అభ్యర్థించారు.
Amazon Layoff: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 18వేల మంది తొలగింపు!
పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్లు రీషెడ్యూల్ చేయబడ్డాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, జనవరి 2023లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, ద్వీపకల్పం, తూర్పు, వాయువ్య భారతదేశంలోని పరిసర ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.