Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను ప్రకటించింది. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడానికి పార్కింగ్ స్థలాలలో ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కింగ్ స్థలాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకల రద్దీని నియంత్రించడానికి ఆఫీస్ సమయాల్లో మార్పులు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్యాలయాలు కేవలం 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని, మిగతా 50 శాతం మంది ఇంటి నుంచి (వర్క్ ఫ్రమ్ హోమ్) విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
కాలుష్య నియంత్రణలో భాగంగా అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. సరైన పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు నిబంధనల ప్రకారం రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు. పీయూసీ కేంద్రాల పనితీరును మరింత నమ్మకమైనదిగా మారుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నిర్మాణ రంగంపై కూడా తీవ్రమైన ఆంక్షలు అమలవుతాయి. నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు దుమ్మును వెలువరించే కూల్చివేతలు, బహిరంగ సివిల్ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 20 వరకు అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 101 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది భారతీయ ప్రమాణం కంటే 2.5 రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల కంటే 20 రెట్లు ఎక్కువ. చండీగఢ్ 70 మైక్రోగ్రాములతో రెండో స్థానంలో, హర్యానా 63, త్రిపుర 62 మైక్రోగ్రాములతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 749 జిల్లాల్లో దాదాపు 60 శాతం జిల్లాలు జాతీయ వార్షిక పీఎం2.5 ప్రమాణాలను అధిగమించినట్లు నివేదిక పేర్కొంది. ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!