NTV Telugu Site icon

Finance Ministry: బడ్జెట్ వేళ ఆర్థిక సమాచారం లీక్.. కాంట్రాక్టు ఉద్యోగి అరెస్ట్

Finance Ministry

Finance Ministry

Finance Ministry: వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది. గూఢచర్యం ఆరోపణలతో కేంద్ర ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక శాఖకు చెందిన ఓ వ్యక్తి కీలక సమాచారాన్ని విదేశాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసు క్రైం విభాగం అతడిని అరెస్ట్ చేసింది.

ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న సుమిత్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గతం కొంతకాలంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సుమిత్.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని , అందుకు బదులుగా భారీ మొత్తంలో డబ్బును తీసుకుంటున్నాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. సమాచారాన్ని చెరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Girls In Burqa: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులకు నో ఎంట్రీ.. కాలేజీలో ఉద్రిక్తత

ఈ అరెస్టుకు సంబంధించి బడ్జెట్‌కు ముందు గూఢచర్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. బడ్జెట్‌కు సంబంధించిన డేటా లీక్ అయితే, మార్కెట్‌పై దాని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖల్లో తరచూ గూఢచర్య ఘటనలసు వెలుగు చూస్తుండటం దేశ భద్రతకు సవాలుగా మారుతోంది.