Site icon NTV Telugu

Amit Shah Fake Video: డీప్‌ఫేక్ వీడియో కేసులో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం

Amith

Amith

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియోల కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. శుక్రవారం స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాను నిర్వహిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఆయన్న న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం ఐఎఫ్ఎస్‌వో యూనిట్ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇక శనివారం అరుణ్‌రెడ్డిని పాటియాల హౌస్ కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఇది కూడా చదవండి: Actor Naresh : రానున్న రోజులలో జాగ్రత్త మిత్రమా.. ఎండ తీవ్రతపై నరేష్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీ మూడోసారి గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ హోంమంత్రి అమిత్ షాకు చెందిన ఓ నకిలీ వీడియోను కాంగ్రెస్‌ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది కాస్త తెగవైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చింది. అలాగే పలువుర్ని అదుపులోకి తీసుకుంది.

అమిత్‌షా డీప్‌ఫేక్‌ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్‌ వీడియోను మొదట పోస్ట్‌ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోష­ల్‌ మీడియా సంస్థ ఎక్స్‌ ట్విట్టర్‌ ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్‌ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..

గత నెల 23న మెదక్‌ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో అది వైరల్‌గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె సతీశ్, శివకుమార్‌ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.

మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్‌ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్‌బుక్‌లను స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథ­మిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్‌’ సంస్థ.. తొలుత ఆ వీడి­యో పోస్ట్‌ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్‌లైన్‌ ఐపీ అడ్రస్‌ నుంచి ఈ వీడియో పోస్ట్‌ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Kamalhasan : కమల్ కు షాక్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..?

Exit mobile version