NTV Telugu Site icon

Air India: విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక.!

Cockroach

Cockroach

Air India: దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి, ప్రయాణికుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. నేను దీన్ని చూసినప్పుడు నా 2 సంవత్సరాల పిల్లవాడు ఆమ్లెట్ సగం తిన్నాడు. దీంతో చిన్నారికి ఫుడ్‌ పాయిజన్‌ ​​అయిందని వాపోయారు.

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం..

ప్రయాణీకుడు విమానంలో వడ్డించిన ఆహారం సంబంధించి చిన్న వీడియో, ఫోటోలను కూడా పంచుకున్నాడు. ఎయిర్ ఇండియా, ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులను ఆయన పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. ఈ సందర్బంగా సదరు ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో, కస్టమర్ అనుభవం గురించి ఆందోళన చెందుతోందని, తదుపరి విచారణ కోసం క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌తో దీనిని తీసుకున్నట్లు ఒక ప్రతినిధి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికార ప్రతినిధి తెలిపారు.

Show comments