NTV Telugu Site icon

Rain: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షం

Keke

Keke

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిరు జల్లులతో నగరం తడిసి ముద్దైంది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఢిల్లీ ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. గత కొద్ది రోజులుగా వేడి గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. రాజధాని ప్రాంతం ఒక్కసారి చల్లబడడంతో ప్రజలు బయటకు వచ్చి ఉల్లాసంగా గడిపారు.

ఇది కూడా చదవండి: NBK109 : బాలయ్య సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు.. ఈసారి థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

ఢిల్లీలో ఇటీవల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. వేసవి కాలం ప్రారంభమైన దగ్గర నుంచి వేడిగాలులతో పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావంతో మెట్రో వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఆర్కేపురంలో గాలులతో పాటు వర్షం కురిసింది.

ఇది కూడా చదవండి: Prabhas : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్.. పిక్ వైరల్..

భారత వాతావరణ శాఖ ఇటీవల అనేక రాష్ట్రాలకు ముఖ్యంగా తూర్పు భారతదేశంలోని హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. అంతేకాకుండా రాబోయే ఐదు రోజుల్లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వేడి తరంగాలు ఉండవచ్చని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా చిరు జల్లులు పడడంతో ఢిల్లీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.