Site icon NTV Telugu

Delhi Air Quality: ఢిల్లీలో మరింత క్షీణించిన వాయు నాణ్యత

Delhi

Delhi

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌-AQI) 300 పైనే ఉండడం గమనార్హం. ఆదివారం ఉదయం ఏక్యూఐ 350గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 4 వందలు దాటిపోటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా ఆనంద్‌ విహార్‌లో ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్‌పూర్‌లో 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖ్లా ఫేజ్‌-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదైంది. వాయు ప్రమాణాలు క్షీణిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా వీలవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

న్యూ ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద మార్నింగ్ వాకర్లు, సైక్లిస్టులు, జాగర్లు గాలి నాణ్యతలో తగ్గుదల కారణంగా ప్రభావితమయ్యారు. ఈనేపథ్యంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ ఎన్‌సీఆర్‌లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఎంపిక చేసిన సేవలు మినహా అన్ని విభాగాల్లో నిర్మాణ పనులుపై నిషేధం విధించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో, దవాఖానాలు, విమానాశ్రయాలు తదితర విభాగాలను ఆంక్షల నుంచి సడలించింది. ప్రజలు రవాణా కోసం షేరింగ్‌ వాహనాలను ఉపయోగించాలని కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. సైకిల్స్‌ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది.

Tamilnadu: కోయంబత్తూరు పేలుళ్ల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

రాజస్థాన్‌లోని 45 బొగ్గు ఆధారిత పారిశ్రామిక యూనిట్లను మూసివేయాలని ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా,32 బొగ్గు ఆధారిత యూనిట్లు (హర్యానాలో 9 యూపీలో 23) శాశ్వతంగా మూసివేయబడ్డాయి. 48 యూనిట్లు (హర్యానాలో 8, యూపీలో 40) ఈ యూనిట్లను ఆమోదించబడిన ఇంధనాలుగా మార్చే వరకు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

Exit mobile version