CCTV: ఫుట్‌పాత్‌పై నిల్చున్న ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man Loses Control Of Car: ఓ డ్రైవర్ కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బాగ్‌లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. గులాబీ బాగ్‌లో ఓ 30 ఏండ్ల యువకుడు తన మారుతి బ్రెజ్జా కారులో వేగంగా వెళ్తున్నాడు. అంతలోనే కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కొంచెం దూరంలో కారును ఆపిన యువకుడిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు.
Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈరోజు ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో స్థానికులు కారు డ్రైవరైన ప్రతాప్ నగర్ నివాసి గజేందర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆగ్రహించిన స్థానికులు ధ్వంసం చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 10, 4 ఏండ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కాగా, ఆరేళ్ల వయసున్న మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో నమోదైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే అంతకు ముందు కూడా గజేందర్ వేగంగా కారు నడిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. మెల్లగా నడపాలని హెచ్చరించినప్పటికీ అతను వినిపించుకోలేదన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.
#WATCH | Delhi: A speeding car hits three children in Gulabi Bagh area this morning, two children received minor injuries while the third is critical but stable and admitted to a hospital: Delhi Police
(Note: Graphic content, CCTV visuals) pic.twitter.com/1HAc4qyqGk
— ANI (@ANI) December 18, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!